PPM: చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం చారిత్రాత్మక తప్పిదమవుతుంది అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుఅన్నారు. ఇవాళ పార్వతీపురం బైపాస్ రోడ్డులో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంను చేపట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసనను తెలియజేస్తున్నారు అన్నారు.