VSP: విశాఖ సీతమ్మధార హెచ్బీ కాలనీ నుంచి పాత పోస్టాఫీసుకి ఆర్టీసీ 20ఏ నంబరుతో సిటీబస్సు నడిచేది. కరోనా తరువాత ఈ సర్వీసును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న జనం ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు.