కర్నూల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఇవాళ పురుషుల, మహిళా జైళ్లను పరిశీలించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును పరిశీలిస్తూ ఖైదీలకు ఉచిత న్యాయసహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా 70 ఏళ్లు దాటిన వారు, అనారోగ్యంతో ఉన్న ఖైదీలకు తక్షణ బెయిల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖైదీల ఆహారం, ఆరోగ్యంపై వివరాలు సేకరించారు.