ప్రపంచంలో తొలి కిస్ ఎప్పుడు పెట్టుకున్నారనే దానిపై తాజాగా జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. సుమారు 20 మిలియన్ల ఏళ్ల క్రితం తొలిసారిగా ముద్దు పెట్టుకున్నారని వెల్లడైంది. తర్వాత దాన్ని అలవాటుగా చేసుకున్నారట. మానవులకు దగ్గరగా ఉండి అంతరించిపోయిన నియాండర్తల్ జాతి కూడా ముద్దు పెట్టుకున్నారని ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.