W.G: తణుకులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు బంగారం గోల్ మాల్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తణుకు సీ.ఎస్.బీ బ్యాంకులో బంగారం తాకట్టుపై అధిక మొత్తంలో రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పడంతో సుమారు 20 మంది ఖాతాదారులు రూ. 1.50 కోట్లు రుణం తీసుకున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే బ్యాంకు సిబ్బంది ఫోర్జరీ సంతకాలతో బంగారం విడిపించి వేరే వ్యాపారాలకు తరలించారు.