SKLM: కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వి. రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ రణస్థలం మండలంలో రైతు సంఘం ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వము ఎన్నికలు ముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.