W.G: జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత 4 నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను పంపిణీ చెసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఇవాళ భీమవరం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆమె వివరాలను వెల్లడించారు. ఓటు నమోదుకు వచ్చిన 3,334 దరఖాస్తుల్లో 2,800 దరఖాస్తులను ఆమోదించామని, 426 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయని తెలిపారు.