MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల లోని వన దుర్గ మాత ఆలయంలో కార్తీకమాసం ఉత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి. ఇవాళ కార్తీక అమావాస్య చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో మహాదేవుడి చిత్రాన్ని రూపొందించి దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో అర్చక బృందం సిబ్బంది ఉన్నారు.