KRNL: మంత్రాలయం, మాధవరం పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, డైరీ, కేసుల స్థితి, గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ & పెండింగ్ కేసులు, కోర్టు డ్యూటీ, సీసీ కెమెరాలు, రిసెప్షన్ విధులను పరిశీలించారు. సిబ్బందికి కేసులను వేగంగా పరిష్కరించి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు.