KMM: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా ధాన్యం కొనుగోలు జరపాలని, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు చెల్లించాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైరా వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీపీఎం బృందం పరిశీలించారు.