WGL: నల్లబెల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు విచ్చేసే రైతులు వారి ఫోన్ నెంబర్కు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు.