సత్యసాయి: పెనుకొండ శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సుధాకర్, ఎంఈవో- 2 మని, స్కూల్ హెచ్ఎం నబి, రిటైర్డ్ టీచర్ షమీవుల్లా, ఉపేంద్ర పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే గ్రంథాలయానికి వెళ్లి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని వక్తలు సూచించారు.