BHNG: కారు ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి చెందిన ఘటన కందుకూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మోటకొండూరుకు చెందిన వంగపల్లి ఉప్పలమ్మ ఇవాళ ఉదయం10 గంటలకు పెద్ద కందుకూరు రైల్వే గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్కి తరగించగా మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందింది.