సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సాయి కుల్వంత్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరికీ బోధించడానికి రాలేదని, ఇక్కడి భక్తి, సేవా భావాన్ని చూసి ప్రేరణ పొందడానికే వచ్చానని తెలిపారు. జీవితంలో శాంతి ఉంటే సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని గడ్కరీ అన్నారు.