KRNL: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ మాధురి తెలిపారు. ఈనెల 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రభుత్వంచే గుర్తించబడే సర్టిఫికెట్ను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఆటోమోటివ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్, JE కోర్సులు ఉన్నాయన్నారు.