KMR: జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్కను గురువారం రైతులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. భిక్కనూరు మండలంలో పర్యటన పూర్తి చేసుకుని సిరికొండ వెళ్తున్న మంత్రి సీతక్కను రామారెడ్డి వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్నాలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.