CTR: ప్రకృతి వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతులకు వివరించాలన్నారు. ఇందులో ఏడీఏ సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు.