NLG: చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన మైనర్ బాలికను, నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన మైనర్ బాలుడు గర్భవతిని చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ లు తెలిపారు. గురువారం సాయంత్రం చిట్యాల పీఎస్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. బాలికతో బాలుడు ఇంస్టాగ్రామ్లో పరిచయం ఏర్పరచుకున్నాడు.