E.G: రాబోయే పుష్కరాల నాటికి రాజమండ్రి సిటీ, రూరల్ రూపు రేఖలు మారుస్తామని అనేక నూతన విధానాలతో ముందుకు వెళ్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో మున్సిపల్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన విషయాలపై చర్చించారు.