AKP: జిల్లాలో ఈనెల 22న ప్రతి గ్రామంలోనూ జాబ్ కార్డు మెగా గ్రామసభలు నిర్వహించనున్నట్లు డూమా పీడీ పూర్ణిమా దేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా జాబ్ కార్డులు కావలసినవారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో తొలగించబడిన జాబ్ కార్డులను తిరిగి పునరుద్ధరించేందుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.