VZM: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరు వ్యక్తులకు ఐదు రోజులు జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ తెలిపారు. జిల్లా ట్రాఫిక్ సీఐ సూరినాయుడు నేతృత్వంలో పట్టణంలో జరిగిన తనిఖీల్లో డి. ఉమాశంకరరావు, కింతలి ప్రసాదరావు పట్టుబడ్డట్లు తెలిపారు. కోర్టు సాక్ష్యాలు పరిశీలించి జైలు శిక్ష విధించిందన్నారు.