కృష్ణా: విజయవాడ, కంకిపాడు, మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల్లో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ చోరీలకు పాల్పడింది తాడిపత్రికి చెందిన కోట్ల భాస్కర్ రెడ్డి అని గుర్తించారు. ఇతను ఏకంగా 45 ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడని, వాహనాలు చోరీ చేయడంలో సిద్ధహస్తుడని ఎస్పీ పేర్కొన్నారు.