KNR: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలసత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంరక్షణ చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. పాఠశాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ, చిన్నారుల ఎలాంటి ఇబ్బందులు కలిగిన 1098కు సమాచారం ఇవ్వాలన్నారు.