MDK: ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం అమావాస్య చివరి రోజు సందర్బంగా గురువారం అమ్మవారి సన్నిధిలో పరమేశ్వరుని రూపం చుట్టూ దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ సేవకు విశేష స్పందన లభించింది.