GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని మోకాళ్లపై నడిపించిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈవో నరసింహ గురువారం విచారణ చేపట్టారు. పోలీసు సిబ్బందితో కలిసి పాఠశాలను సందర్శించి, కరస్పాండెంట్ షాలుబాషాను ప్రశ్నించారు. మూడో తరగతి బాలుడు ఉదయకుమార్ పట్ల టీచర్ వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు.