MBNR: బాలానగర్ మండల పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే స్థలాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా సూచిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్, ఎస్సైలు గోపాల్ రెడ్డి, సుజ్ఞానం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.