TPT: చిల్లకూరులోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించారు. గురువారం పెంచలకోన నరసింహ స్వామి ఆలయ మాజీ ఛైర్మన్ తానంకి నానాజీ ఆయన నివాసంలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా రూ.25 వేల క్రీడా సామాగ్రిని విద్యార్థులకు అందించారు. క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.