RR: బీజాపూర్ జాతీయ రహదారిపై ఖానాపూర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వికారాబాద్ నుంచి చేవెళ్ల వైపునకు వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ వడ్డే శ్రీరామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.