అన్నమయ్య: పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శ్రీసాయి నారాయణ సేవ ట్రస్ట్ తరఫున గురువారం వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగుల సౌకర్యార్థం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ పరికరాలు అత్యవసర సమయంలో ఆక్సిజన్ సరఫరాకు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, డాక్టర్లు, సూపర్వైజర్ పాల్గొన్నారు.