NLG: దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే బాలు నాయక్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల సిబ్బందితో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.