WGL: ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని WGL కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.