KMM: ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామం అంగన్వాడీ కేంద్రం-4లోని 20 మంది చిన్నారులకు కాంగ్రెస్ నేత అయోధ్య తన అన్నయ్య వెంకటేశ్వర్లు జ్ఞాపకార్ధంగా ఉచితంగా భోజన ప్లేట్లను అందజేశారు. ఆయన చేసిన ఈ మంచి పనిని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయ, గ్రామస్థులు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.