TG: కమలాపురం పీఎస్‌లో బండి సంజయ్‌పై నమోదైన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. 2023 పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ఆయనపై కేసు నమోదైంది. కమాలాపురం పోలీసులు ఈ కేసులో బండి సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసును తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.