నారాయణపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రీకారం చుట్టారు. గురువారం జిల్లా ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య పట్టణంలోని ప్రధాన రహదారి, కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. ఈ మేరకు సింగారం చౌరస్తా, దామరగిద్ద, యాదగిరి రోడ్డులను పరిశీలించారు.