KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి 60 మంది లబ్ధిదారులకు రూ. 21,19,232 CMRF సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న CMRF చెక్కుల వల్ల లబ్ధిదారులకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.