నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీతో విభేదాలున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. అలా అనుకుంటే వారే నష్టపోతారని, తామిద్దరం ఎప్పుడూ విడిపోమని, జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేస్తామని ప్రకటించారు.