HYD: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో ఆయనను కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం నవీన్ యాదవ్‌ను స్పీకర్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.