MDK: చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. వడియారం గ్రామానికి చెందిన నల్ల పరమేష్ (25) ఈనెల 18న రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయినట్లు వివరించారు. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో తల్లి నల్ల యాదమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వివరించారు.