KDP: కడపలో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం డీఎస్పీ పర్యవేక్షణలో వన్ టౌన్ పరిధిలో అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘాతో అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నిందితులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.