KMM: ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా రాజు, టీ. ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా 47వ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కాగా, సమావేశంలో వివిధ సమస్యల మీద తీర్మానాలు ఆమోదించుకుని భవిష్యత్తు ఉద్యమానికి దిశానిర్దేశం చేసుకున్నారు.