PLD: అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతో పాటు నియోజకవర్గ పరిశీలకుడు నల్లపాటి రాము పాల్గొన్నారు. జ్యోతి సురేఖ ఇప్పటివరకు గెలుచుకున్న మెడల్స్, అవార్డులను ఇద్దరు పరిశీలిస్తూ ఆమె క్రీడా ప్రతిభను ప్రశంసించారు. ఆమె విజయాలు యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.