గాజా, ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ దళాలు క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 25మంది మృతి చెందినట్లు, మరో 77మంది గాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై దాడి చేయగా.. 10 మందికిపైగా ప్రజలు చనిపోయారు.