ADB: ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డీఎస్సీ సాధన కమిటీ సభ్యుడు జాదవ్ సోమేశ్ అన్నారు. ఆయన గురువారం హైదరాబాదులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ITDAలోని సమస్యల పరిష్కారం, అభివృద్ధి పథకాల అమలు కోసం కృషి చేయాలనీ కోరారు.