MBNR: బీసీలకు కల్పించిన రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని గురువారం బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలో బీసీ రణభేరి సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సమాజం హక్కుల కోసం ఐక్యంగా నిలిచే వేదికగా ఈ సభ నిలుస్తుందన్నారు.