WNP: విద్య ఎంతో విలువైనదని, దానిని క్రమశిక్షణతో అభ్యసించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వీపనగండ్ల జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు వివిధ చట్టాలపై, ఉచిత న్యాయ సహాయం, హెల్ప్ లైన్ నంబర్లపై (15100, 1098) అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.