PPM: సమాజానికి నిరంతరం సేవ చేస్తున్న మీడియా ప్రతినిధుల ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది తెలిపారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి సహకారంతో జిల్లా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇవాళ ప్రారంభించారు. పరీక్షలు చేయించుకొని వైద్యులు సూచనలు పాటించాలి అన్నారు.