TG: హనుమంతుడిపై విశ్వాసం లేదని రాజమౌళి అన్నారని MLA రాజాసింగ్ తెలిపారు. ‘నమ్మకం లేకపోతే దేవుళ్లపై ఎందుకు సినిమాలు తీస్తున్నారు. వారణాసి సినిమా ప్రచారం కోసమే అలా మాట్లాడారా? లేక నిజంగా నాస్తికుడా అనేది క్లారిటీ ఇవ్వాలి. గతంలోనూ శ్రీకృష్ణుడి దాసీలపై కామెంట్ చేశారు. రాముడిది బోరింగ్ స్టోరీ అని గతంలో అన్నారు. ఇప్పుడు హనుమంతుడిపై కామెంట్ చేశారు’ అని పేర్కొన్నారు.