కర్నూల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా పారిశ్రామిక–ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల విస్తరణ, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, ఎగుమతి అవకాశాలు గుర్తించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.