KMM: ఖమ్మం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు.