ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ కాలం విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.